America Population: అమెరికా జనాభా 34 కోట్లు ..! 2 d ago
వాషింగ్టన్ : అమెరికా జనాభా 34 కోట్లకు చేరుకుంది. దేశ జనాభా లెక్కలను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది పెరిగినట్లు పేర్కొంది. 2023, 24లో 33 లక్షల మంది జనాభా పెరగగా అందులో వలసలే 84 శాతం ఉన్నాయి. ఇందులో మరణాల కంటే జననాలే అత్యధికంగా నమోదయ్యాయి. 2001 తర్వాత ఈ ఏడాది నమోదైన 1 శాతం వృద్ధి 23 ఏళ్లలో అత్యధికం. 2021లో కరోనా కారణంగా వలసలు తగ్గి 0.2శాతమే జనాభా వృద్ధి రేటు నమోదైంది.